మిలియన్ మార్క్ అందుకున్న ‘అర్జున్ రెడ్డి’ !


యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్లను రాబడుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక ఇతర భాషల పరిశ్రమల వాళ్ళు కూడా సినిమాను ఆకాశానికెత్తేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విడుదలైన ప్రతి చోట అసలు రాబట్టి లాభాల్లోకి దూసుకెళ్లిన ఈ చిత్రం ఓవర్సీస్లో అయితే ఊహించని రీతిలో పెర్ఫార్మ్ చేస్తోంది.

గురువారం ప్రీమియర్ల ద్వారా 1.94 లక్షల డాలర్లను, శుక్రవారం నాడు 2.6 లక్షల డాలర్లను, శనివారం నాడు 3.2 లక్షల దాలర్లను, ఆదివారం రోజున సుమారు 1.7 లక్షల డాలర్లను రాబట్టి సోమవారం నాటికి మిలియన్ మార్క్ అందుకుంది. ఈ సినిమా ఇంత వేగంగా చాలా మంది హీరోలకు కలగా ఉన్న మిలియన్ దాలర్ మైలు రాయిని అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాతో పరిశ్రమకు సందీప్ రెడ్డి వంగ వంటి ఒక విలక్షణ దర్శకుడు దొరికాడనే ప్రసంశలు కూడా అందుతున్నాయి.