గతేడాది తెలుగు పరిశ్రమలో రిలీజైన సినిమాల్లో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగల ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి విజయాన్ని సాధించిందో వేరే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువతకు బాగా కనెక్టై భారీ స్థాయి వసూళ్లను సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండించిన ఈ సినిమా టీవీల్లో కూడా అదే స్థాయి విజయాన్ని అందుకుంది.
శాటిలైట్ హక్కుల్ని కొన్న మా టీవీలో ఆదివారం ప్రీమియర్ల రూపంలో ప్రసారమైన ఈ చిత్రం 13.6 టిఆర్పీ రేటింగ్స్ ను సాధించింది. ఈ చిత్ర విజయంతో దేవరకొండ స్టేటస్ అమాంతం మారిపోయింది. వరుస ఆఫర్లు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చారు. అలాగే హీరోయిన్ షాలిని పాండేకు కూడా మంచి ఛాన్సులు దక్కగా నిర్మాతలు చాలా మంది సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
