‘అర్జున్ రెడ్డి, విఐపి-2’ కృష్ణా జిల్లా వసూళ్లు !


గత వారం విడుదలైన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ చిత్రం బ్రహ్మాండమైన వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది. రిలీజైన ప్రతి చోట చిత్రం లాభాల దిశగా వెళుతోంది. ఏపి, తెలంగాణల్లో అయితే మొదటి మూడు రోజులకు కలిపి రూ.7.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా కృష్ణా జిల్లాలో 6వ రోజు కూడా రూ.6. 96 లక్షలు రాబట్టి మొత్తంగా 6 రోజులకు కలిపి రూ.70.29 లక్షల షేర్ ను వసూలు చేసింది.

ఇక ఇదే ఏరియాలో మరొక చిత్రం ‘జయ జానకి నాయక’ 19 వ రూ .30,725 వసూలు చేసి మొత్తంగా రూ. 1.27 కోట్ల షేర్ ను నమోదుచేసింది. ఇక డబ్బింగ్ చిత్రం ‘విఐపి-2’ 5వ రోజు రూ.1.91 లక్షల షేర్ ను రాబట్టి 5 రోజులకు కలిపి రూ. 22.72 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకుంది.