సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న శ్రీ విష్ణు “అర్జున ఫల్గుణ”

Published on Dec 27, 2021 7:10 pm IST


శ్రీ విష్ణు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా తేజ మర్ని దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అర్జున ఫల్గుణ. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ చిత్రం.

ఇందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం ను డిసెంబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :