ఓటీటీలోకి “అర్జున ఫల్గుణ”.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Published on Jan 13, 2022 10:02 pm IST

యంగ్ హీరో శ్రీవిష్ణు మరియు అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా, తేజ మార్ని దర్శకత్వం వహించిన చిత్రం “అర్జున ఫల్గుణ”. డిసెంబర్‌ 31న రిలీజైన ఈ క్రైమ్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆహా ప్రకటించింది. నరేశ్‌, సుబ్బరాజు, మహేశ్‌, శివాజీ రాజా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి నిర్మించారు. ప్రియదర్శన్‌ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :