నటుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ పై దాడి !

‘టర్మినేటర్, ప్రిడేటర్’ వంటి సూపర్ హిట్ సినిమాలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌. అలాంటి నటుడి మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం ఆర్నాల్డ్‌ దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో ‘క్లాసిక్‌ ఆఫ్రికా’ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించారు.

అక్కడ అభిమానులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఉన్నట్టుండి ఆర్నాల్డ్‌ను వెనక నుండి కాలితో తన్నాడు. వెంటనే స్పదించిన ఆయన బాడీ గార్డ్స్ సదరు వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో ఆర్నాల్డ్ ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారు. ఈ ఘటనపై సరదాగా స్పందించిన ఆర్నాల్డ్ ఆ ఇడియట్‌ నా స్నాప్‌చాట్‌ వీడియోను చెడగొట్టనందుకు సంతోషంగా ఉంది అన్నారు.

And if you have to share the video (I get it), pick a blurry one without whatever he was yelling so he doesn’t get the spotlight.

By the way… block or charge? pic.twitter.com/TEmFRCZPEA

— Arnold (@Schwarzenegger) May 18, 2019