నటుడు, నిర్మాత చిన్న భార్య మృతి !

12th, September 2017 - 05:47:48 PM


రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీకి నటుడిగా పరిచయమై నిర్మాతగా కూడ పనిచేసిన చిన్న అలియాస్ జితేందర్ రెడ్డి సతీమణి శిరీష కొద్దిసేపటి క్రితమే మరణించారు. ఆమె ఆకస్మిక ఆనారోగ్యానికి గురవడంతో వైద్యం నిమిత్తం హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేర్పించారు.

కేవలం 42 ఏళ్ల వయసున్న శిరీష ట్రీట్మెంట్ జరుగుతుండగానే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని చిన్న స్వయంగా తెలిపారు. సతీ వియోగంతో తీవ్ర విషాదంలో మునిగిన చిన్నకు, ఆయన కుటుంబానికి ఆ బాధను తట్టుకునే శక్తి కలగాలని 123తెలుగు.కామ్ ఆశిస్తోంది.