‘సాహో’ సినిమాలో తనది నెగెటివ్ పాత్ర కాదంటున్న నటుడు !

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కావడంతో దీన్ని జాతీయస్థాయిలో రూపొందించాలని నిర్ణయించుకున్న దర్శక నిర్మాతలు వివిధ పరిశ్రమలనటీనటులను ఇందులో నటింపజేస్తున్నారు. ఆ నటుల్లో తమిళ నటుడు అరుణ్ విజయ్ కూడా ఉన్నారు.

ఈ మధ్య అరుణ్ విజయ్ నెగిటివ్ పాత్రలతో బాగా ఫేమస్ కావడం వలన ‘సాహో’ కూడా అయన విలన్ పాత్రనే చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని, సినిమాలో తనది మంచి స్వభావం కలిగిన పాత్రేనని, ఇంకొన్ని షెడ్యూల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్, ఇహసాన్, లోక్ లు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.