రాయ్ ఫిల్మ్స్ నిర్మాణంలో రాకీ షెర్మాన్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కర్మస్థలం’. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ కృష్ణకు సంబంధించిన పవర్ఫుల్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ఆయన ఒక యోధుడిలా కనిపిస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు.
ఒకవైపు సూపర్ హీరో పాత్రలతో అలరించడానికి సిద్ధమవుతున్న అరవింద్ కృష్ణ.. ‘కర్మస్థలం’లో పూర్తి భిన్నమైన యోధుడి అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి విజువల్స్, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయనున్నారు.
