ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అరవింద స్వామి !

ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అరవింద స్వామి !

Published on Dec 2, 2016 9:59 AM IST

arvind-swamy
భారత ప్రభుత్వం ప్రతి సినిమా థియేటర్లో సినిమా మొదలవడానికి ముందు జాతీయ గీతాన్ని ఖచ్చితంగా ఆలపించాలని రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని థియేటర్లకు ఉత్తర్వులు పంపాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకత తెలుపుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికే చెందిన పలువురు ప్రముఖులు ఈ నిర్ణయాన్ని స్వాగతించడం లేదు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు అరవింద స్వామి కూడా ఉన్నారు.

ఈ సీనియర్ నటుడు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలుపుతూ ‘అసలు థియేటర్లో సినిమాకి ముందు జాతీయ గీతం ఎందుకు పాడాలో ఎవరైనా వివరిస్తారా. ఎక్కడైనా వేలమందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక క్రీడా సంబంధమైన ఈవెంట్ జరిగేటప్పుడు జాతీయగీతం పాడవచ్చు. కానీ థియేటర్లు, జనం ఎక్కువగా ఉండే పబ్లిక్ ప్రదేశాల్లో జాతీయ గీతం పేరుతో ఎగ్జిట్స్ లాక్ చేసి వాళ్ళను బ్లాక్ చేయడం సరైనది కాదు. దీని గురించి మరోసారి ఆలోచించాలి. 1997 లో ఉఫార్ థియేటర్లో ఎగ్జిట్ లాక్ చేయడం వలన జరిగిన దుర్ఘటనను ఒక్కసారి గుర్తుచేసుకోండి’ అంటూ ఆలోచనాత్మకమైన తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ కూడా తన వ్యతిరేకతను తెలుపుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు