‘చరణ్ – శంకర్’ సినిమాలో కొత్త విలన్ ?

Published on Mar 21, 2022 11:02 pm IST

క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఇప్పటికే ఒక విలన్ గా హీరో శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇప్పుడు మరో విలన్ కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నాడు. మాజీ అందాల హీరో అరవింద్ స్వామి కూడా మెయిన్ విలన్ గా నటిస్తాడట. అరవింద్ స్వామి ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. అసలు ఇతను అరవింద్ స్వామినా? అనేలా ఆయన పాత్ర ఉంటుందట. మరి ఈ పాత్ర ద్వారా అరవింద్ స్వామి ఎలా మెప్పిస్తారో చూడాలి. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడు.

సంబంధిత సమాచారం :