ఇక మీరంతా గర్వపడేలా చేస్తాను – ఆర్యన్‌ ఖాన్

Published on Oct 18, 2021 10:00 am IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ డ్రగ్స్ లో ముగినితేలుతూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటి నుంచి పోలీసులు ఈ సూపర్ స్టార్ కుమారుడిని అదుపులోకి తీసుకుని పలు రకాలుగా విచారించారు. కాగా తాజాగా అధికారులు ఆర్యన్ ఖాన్ కి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కౌన్సెలింగ్‌ అనంతరం ఆర్యన్ ఖాన్ మాట్లాడుతూ ‘జైలు నుంచి విడుదలయ్యాక మీరంతా గర్వపడేలా మంచి పనులు చేస్తాను’ అని తెలిపాడు.

ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఇక నుంచి నేను నిరు పేదల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి కోసమే పని చేస్తాను. చెడు మార్గాల్లో నడవను’ అని చెప్పుకొచ్చాడు. ఎన్‌సీబీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖెడేకు ఈ విధంగా ఆర్యన్‌ హామీ కూడా ఇచ్చాడట. నిజానికి ఆర్యన్ ఖాన్ గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తానూ యూకేలో ఉన్నప్పటి నుంచే డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆర్యన్ కూడా వెల్లండించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More