ఇక మిగిలి ఉంది “RRR” అనౌన్స్మెంట్ మాత్రమేనా?

Published on Oct 2, 2021 11:00 am IST


మళ్ళీ ఇండియన్ సినిమా నుంచి అనేక సినిమా రిలీజ్ డేట్ లు అనౌన్స్ పర్వం స్టార్ట్ అయ్యింది. అయితే గత లాక్ డౌన్ తర్వాత మొట్ట మొదటిగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన భారీ చిత్రం “RRR”. దాని తర్వాతనే ఒక్కసారిగా అనేక సినిమాలు రిలీజ్ డేట్ లు ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పరిస్థితులు రీత్యా సినిమాలు వాయిదా పడి మిగతా అన్ని సినిమాలు రిలీజ్ డేట్ లు తెచుకుంటున్నాయి..

లేటెస్ట్ గా “పుష్ప” కూడా డేట్ ఇచ్చేసింది. కానీ ఇంకా ఈ భారీ సినిమా నుంచి మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. దీనితో ఈ బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ కోసమే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గత మూడు రోజులు నుంచి ఇదిగో వచ్చేస్తుంది అని టాక్ వైరల్ అవుతున్నా చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి మూమెంట్ లేదు. కానీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ మోస్ట్ అవైటెడ్ అనౌన్సమెంట్ ఉండొచ్చని తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :