మార్చి 20న.. ‘అసలు ఏంజరిగిందంటే..’ !

Published on Mar 13, 2020 12:00 pm IST

ఏబీఆర్ ప్రొడక్షన్స్ మరియు జిఎస్ ఫిలిమ్స్ పతాకంపై అనిల్ బొద్దిరెడ్డి సమర్పిస్తున్న చిత్రం ‘అసలు ఏంజరిగిందంటే’. మహేంద్రన్, శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రిన్ ప్రదాన పాత్రదారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ బండారి దర్శకత్వం వహించగా, అనిల్ బొద్దిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీనివాస్ బండారి మాట్లాడుతూ.. ‘‘ ఈ ట్రైలర్‌ను గెస్ట్‌లు ఎవరూ లేకుండా.. మీడియా సమక్షంలో విడుదల చేయడానికి కారణం.. మొదటి నుంచి వారిస్తున్న సపోర్టే. ఇప్పటి వరకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదల కాబోతోంది. మీడియా వారికి ముందుగా ఈ ట్రైలర్‌ను చూపించి, వారి జడ్జిమెంట్‌తో సినిమాని ప్రేక్షకులదగ్గరకు తీసుకువెళ్లాలనే ఈ ట్రైలర్‌ను ఇలా విడుదల చేశాము. ట్రైలర్ చూసిన అందరూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఎంతో సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ మా చిత్రయూనిట్ తరుపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాకి ‘అసలు ఏంజరిగిందంటే..’ అనే టైటిల్ పెట్టడానికి కారణం.. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు వారి దైనందిన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరులకు విషయాన్ని చెప్పడానికి ఈ మాటను వాడతారు. నేను ఈ సినిమా కథను చెప్పడానికి ఈ టైటిల్‌ను పెట్టడం జరిగింది. ‘అసలు ఏంజరిగిందంటే..’ అని మొదలుపెట్టి నేను ఈ కథను చెప్పబోతున్నాను.

ఆయన ఇంకా మాట్లాడుతూ… ‘మనిషి జీవితంలో జరిగిపోయింది తప్ప.. జరగబోయేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు నవ్వుతూ ఉండేవారికి ఇంకొంచెం సేపట్లో ఏదైనా జరగవచ్చు. అదేంటనేది చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. దీనికి సమాధానం దేవుడే చెప్పాలి. కాలంతో పాటు పరిగెత్తడం తప్ప.. అంతకుమించి మనం ఏమీ చేయలేం. అదే ఈ సినిమాలో చెప్పదలుచుకున్నాను. నేను రాసుకున్న కథకి వాస్తవంగా చెప్పాలంటే పెద్ద హీరో, అనుభవం ఉన్న హీరో కావాలి. నేను కొత్తవాడిని. నాతో పెద్ద హీరో అంటే అయ్యే పని కాదు. అందుకే 150 సినిమాల్లో బాలనటుడిగా నటించిన మహేంద్రన్‌ని హీరోగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. మహేంద్రన్ ఈ సినిమాలో చాలా చక్కగా చేశాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. చరణ్ అర్జున్ ఇచ్చిన సంగీతం అందరినీ అలరిస్తుంది. 6 పాటలున్నాయి. అన్నీ చక్కగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ హైలెట్‌గా ఉంటుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. సినిమా చాలా చక్కగా వచ్చింది. ఈ సినిమాలో ఎటువంటి ద్వందర్థాలు, సీన్లు ఉండవు. సెన్సార్ నుంచి సింగిల్ కట్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ వచ్చింది. మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..” అని అన్నారు.

హీరో మహేంద్ర మాట్లాడుతూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఏదో ఒక స్పెషల్‌తో హీరోగా పరిచయం అవ్వాలనే ఈ కథను సెలెక్ట్ చేసుకుని చేయడం జరిగింది. రగ్డ్ క్యారెక్టర్ ఉన్న పాత్ర. చెప్పాలంటే రవితేజగారి పాత్రలా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్టుగా ఆదరించారు. ఇప్పుడు హీరోగా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్న నాపై అదే ఆదరణ చూపుతారని ఆశిస్తున్నాను..” అన్నారు.

సంబంధిత సమాచారం :

X
More