‘సూసేకి’ పార్టీకి లేటుగా వ‌చ్చిన ఆషికా రంగనాథ్‌

‘సూసేకి’ పార్టీకి లేటుగా వ‌చ్చిన ఆషికా రంగనాథ్‌

Published on Jul 4, 2024 12:39 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కుతున్న ‘పుష్ప-ది రూల్’ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకించి చెప్ప‌క్క‌ర్లేదు. పుష్ప-1 మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో ఇప్పుడు అంద‌రి చూపు పుష్ప-2పై ఉంది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. రీసెంట్ గా క‌పుల్ సాంగ్ అంటూ ‘సూసేకి’ సాంగ్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాట‌కు యావ‌త్ ఇండియాతో పాటు ప్ర‌పంచంలోని అభిమానులు డ్యాన్స్ చేస్తున్నారు. ఈ పాట‌లో అల్లు అర్జున్, ర‌ష్మిక‌లు క‌లిసి వేసిన స్టెప్పుల‌కు సాలిడ్ రెస్పాన్స్ ల‌భించింది. ఇక ఈ పాట సోష‌ల్ మీడియాలో తుఫాన్ క్రియేట్ చేస్తోంది. కామ‌న్ ఆడియెన్స్ నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఈ పాట‌ ట్యూన్ కి స్టెప్పులు వేస్తూ వీడియోలు తీస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో అందాల భామ ఆషికా రంగ‌నాథ్ చేరింది.

‘సూసేకి’ పాట‌కి స్టెప్పులు వేసే పార్టీకి తాను కొంచెం లేటుగా వ‌చ్చానంటూ ఈ పాట‌కు సూప‌ర్ స్టెప్పులు వేసింది. త‌న ఇన్స్టా అకౌంట్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇక ఈ ‘సూసేకి’ పాట‌ను శ్రేయా ఘోష‌ల్ పాడ‌గా, దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు