అశోక్‌ గల్లా “అచ్చ తెలుగందమే” పాటకు అద్భుతమైన రెస్పాన్స్..!

Published on Oct 28, 2021 2:00 am IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్‌ గల్లా తనయుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతూ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రం “హీరో”. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.

అయితే ఇటీవల ఈ సినిమా నుంచి “అచ్చ తెలుగందమే” అనే లిరికల్ సాంగ్ విడుదల కాగా ఈ పాటకు యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ పాట 3.5 మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టింది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, సిద్ శ్రీరామ్, అనుదీప్ దేవ్ మరియు నమిత బాబు ఆలపించారు. కాగా ఈ సినిమాకి జీబ్రాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :