మొదటి సినిమాతో ఆకట్టుకున్న యంగ్ హీరో !

Published on Jan 17, 2022 5:30 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతూ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన చిత్రం “హీరో”. కాగా ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. అశోక్ గల్లా తన పాత్రను బాగా పోషించాడని, అతను మొదటి సినిమా హీరోలా కనిపించలేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తపరిచారు. ముఖ్యంగా అశోక్ గల్లా తన కామిక్ టైమింగ్ తో, అలాగే స్టైలిష్ డ్యాన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు.

ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించింది. “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ వాయిదా పడడంతో “హీరో” సినిమాను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు మేకర్స్. జనవరి 15న ఈ సినిమాను విడుదల అయింది. ఈ రిలీజ్ డేట్ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :