లేటెస్ట్ : గ్రాండ్ గా లాంచ్ అయిన మహేష్ మేనల్లుడి సెకండ్ మూవీ

Published on Feb 5, 2023 7:04 pm IST

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణగారి మనవడు, నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అయిన అశోక్ గల్లా ఇటీవల ఫస్ట్ మూవీ హీరో ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చి మంచి విజయం సొంతం చేసుకున్నారు. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఫస్ట్ మూవీ అనంతరం మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేసిన అశోక్ తాజాగా సెకండ్ మూవీని ప్రారంభించారు. నేడు ఈ మూవీ యొక్క గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో పలువురు సినీ ప్రముఖులు సమక్షంలో జరిగింది. అ, కల్కి, జాంబీ రెడ్డి సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ కథని అందిస్తున్న ఈ మూవీకి అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో కార్తికేయ తో గుణ 369 మూవీ తెరకెక్కించారు అర్జున్. లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన నిర్మాత సామినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించనున్నారు. వినూత్నమైన కథ, కథనాలతో రూపొందనున్న ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్, నమ్రతా మహేష్, బోయపాటి శ్రీను తదితరులు ప్రత్యేక అతిథలుగా విచ్చేసారు. కాగా ముహుర్తపు షాట్ కి విక్టరీ వెంకటేష్ క్లాప్ కొట్టగా, నమ్రత శిరోద్కర్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బోయపాటి శ్రీను తొలిషాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు.ఇక నిర్మాతలు మిరియాల రవీందర్ రెడ్డి, సాహు గారపాటి, హరీష్ పెద్ది స్క్రిప్ట్ ని మేకర్స్ కి అందచేశారు. ఆదిశేషగిరి రావు, పద్మావతి, గల్లా జయదేవ్, బివిఎస్ రవి తదితరులు ఈ మూవీ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :