అశోక్‌ సెల్వన్, రీతూవర్మ జంటగా “ఆకాశం”..!

Published on Feb 8, 2022 3:00 am IST

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా దక్షిణాదిన బై లింగ్వుల్‌ సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి తమిళంలో ‘నిత్తమ్ ఒరు వానమ్’, తెలుగులో ‘ఆకాశం’ అనే పేర్లతో రిలీజ్ కానుంది. అశోక్‌ సెల్వన్, రీతూవర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ కీలక పాత్ర పోషించగా, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు.

ఫీల్ గుడ్ ట్రావెలాగ్ ను తలపించే ఈ ద్విభాషా చిత్రానికి రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. చెన్నై, హైదరాబాద్‌, మనాలి, వైజాగ్, గోవా, ఢిల్లీ, చండీఘడ్, కోల్‌కత్తా, పొల్లాచి తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్‌, ఆడియో రిలీజ్‌ డేట్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :