అశోకవనంలో అర్జున కళ్యాణం.. ఆహాలో అప్పటినుంచేనా?

Published on May 19, 2022 2:25 am IST


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, రుక్సర్ దిల్లాన్ హీరోయిన్‌గా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం “అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ని అందుకుంది.

అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయ్యిందని, ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :