“అశోక వనంలో అర్జున కళ్యాణం” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్

Published on May 1, 2022 11:30 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం మే 6, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్ ధిల్లాన్ కథానాయిక గా నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 3, 2022 న సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుందని మేకర్స్ ప్రకటించారు.

ఖమ్మంలోని లేక్‌వ్యూ క్లబ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వస్తారనే సమాచారం లేదు. ఎస్‌విసిసి డిజిటల్ నిర్మించిన ఈ అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :