‘అశోకవనంలో అర్జున కళ్యాణం” నుంచి “సిన్నవాడా” సాంగ్ రిలీజ్..!

Published on Feb 16, 2022 1:00 am IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, రుక్సర్ దిల్లాన్ హీరోయిన్‌గా విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం ”అశోకవనంలో అర్జున కళ్యాణం”. బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మార్చి 4వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో జోరును పెంచింది.

ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. “ఓరోరి సిన్నవాడా సిన్నవాడా గగ్గోలు పడకోయి పిల్లగాడా” అంటూ సాగే పాట ఆకట్టుకుంటుంది. జై క్రిష్ స్వరపరిచిన ఈ పాటకి సానపాటి భరద్వాజ్ సాహిత్యం అందించగా, అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్ కలిసి ఆలపించారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :