“సర్కస్ కార్-2″లో అషు రెడ్డి గ్లామర్ కూడా హైలైట్.!

“సర్కస్ కార్-2″లో అషు రెడ్డి గ్లామర్ కూడా హైలైట్.!

Published on Nov 27, 2021 9:48 AM IST

కొన్ని ఫాంటసీ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ టాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి వాటిలో హారర్ ఎంటర్టైనర్ సర్కస్ కార్ కూడా ఒకటి. దీనికి సీక్వెల్ గా “సర్కస్ కార్-2” ఇప్పుడు తెరకెక్కుతుంది. నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొంది మంచి విజయం సాధించిన “సర్కస్ కార్”కి సీక్వెల్ గా ఇది తెరకెక్కింది.

అయితే బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య తారాగణంగా ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ హారర్ ఎంటర్టైనర్ నిరిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ… “సర్కస్ కార్” సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఆ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాలు పొట్టలు చెక్కలు చేస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని పంచే “సర్కస్ కార్-2” మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్ కి మరింత మంచి పేరు తెస్తుంది. పిల్లల నటన, ఆషు రెడ్డి-గ్లామర్ “సర్కస్ కార్-2″కి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి” అన్నారు.

ఇక ఈ చిత్రంలో బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు చేస్తుండగా పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఆర్ట్: బి.ఎస్.జగన్నాధరావు, డి.ఐ: డాలి శేఖర్, మ్యూజిక్: చైతన్య, ఎడిటింగ్: గౌతమ్ కుమార్, కెమెరా: జి.ఎస్.చక్రవర్తి రెడ్డి (చక్రి), నిర్మాత: శివరాజు వి.కె, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నల్లబిల్లి వెంకటేష్ లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు