ఓంకార్ తమ్ముడి కొత్త సినిమా టైటిల్ నేడు తేలిపోనుందిగా?

Published on Aug 1, 2021 2:00 am IST

బుల్లి తెర ప్రముఖ యాంకర్ ఓంకార్ తమ్ముడు హీరో అశ్విన్ బాబు గుర్తున్నాడు కదా.. విభిన్న కథలను, సరికొత్త పాత్రలను ఎంచుకుని ఇప్పటి వరకు 6 సినిమాలు చేసిన అశ్విన్ బాబు ఇప్పుడు ఏడో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో, శ్రీ విగ్నేస్ కార్తీక్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే #AB7 పేరుతో ఈ మూవీకి సంబంధించిన ప్రీలుక్ పోస్ట్రర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అయితే ఇందులో చేతికి రక్తం కారుతున్నా పిడికిలి బిగించి నిలబడ్డ హీరో పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతుంది. ఇదే పోస్టర్‌లో నేడు మధ్యాహ్నం 2:52 నిమిషాలకు సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రెండు రివీల్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన నందిత శ్వేత హీరోయిన్‌గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :