సీరియస్ గా ‘హిడింబ’ సీక్వెన్స్ చదువుతున్న అశ్విన్!

Published on Sep 3, 2021 8:53 pm IST

హీరో అశ్విన్ లేటెస్ట్ గా నటిస్తున్న తాజా చిత్రం “హిడింబ”. తన కెరీర్ లో ఫుల్ ఆన్ సాలిడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఈ చిత్రం నుంచి ఆ మధ్య వచ్చిన టైటిల్ రివీల్ పోస్టర్ మంచి ఆసక్తిని రేపింది. దర్శకుడు అనీల్ కృష్ణ కన్నెగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తాలూకా స్క్రిప్ట్ ని అశ్విన్ సీరియస్ గా చదువుతున్న ఫోటో బయటకి వచ్చింది. ఈ పర్టిక్యులర్ సీన్ సినిమాలో చాలా కీలకం అట. అందుకే దానిని అంత సీరియస్ చదువుతున్నాడట.

మరి ఆ సీన్ ఎలాంటిదో చూడాలి. ఇక ఈ చిత్రంలో అశ్విన్ సరసన నందిత శ్వేతా హీరోయిన్ గా నటిస్తుండగా వికాస్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఎస్ వి కె సినిమాస్ వారు ఈ చిత్రాన్ని మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :