అన్నాత్తే హక్కులను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్..!

Published on Oct 14, 2021 3:03 am IST


సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్, శివ దర్శకత్వంలో తెరకెక్కిన “అన్నాత్తే” సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, కుష్బూ, న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, మీనా వంటి స్టార్స్ న‌టిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది.

అయితే టాలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సినిమాస్ ఈ సినిమా ఏపీ మరియు తెలంగాణలో తెలుగు మరియు తమిళ హక్కులను పొందింది. నారాయణదాస్ నారంగ్ మరియు సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఇమ్మాన్ సంగీతం అందించగా, ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రాఫర్ మరియు రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం :