యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. కాగా తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది చిత్రబృందం. ప్రస్తుతం నాగ శౌర్య ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను చెబుతున్నారు. ఇక రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ ను విడుదల అయిన సంగతి తెలిసిందే. అత్యంత గ్రిప్పింగ్ గా ఉన్న ఈ టీజర్ కు ప్రేక్షుకుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
కాగా నిర్మాత ఉషా ముల్పూరి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారట. ఇక ఈ సినిమాలో సందర్భానుసారం మంచి యాక్షన్ సీక్వెన్స్ స్ ఉన్నాయట. మొదటిసారి ఈ చిత్రంలో నాగశౌర్య సరసన హీరోయిన్ గా మెహరీన్ నటిస్తుంది. ‘ఎఫ్ 2’ తరువాత మెహరీన్ చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి మెహరిన్ హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకుల అలరించబోతుంది. పోసాని కృష్ణమురళీ, సత్య, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ శ్రీచరణ్, కెమెరా మనోజ్ రెడ్డి, ఎడిటర్ గారీ బిహెచ్, డైరెక్షన్ రమణ్ తేజ, ప్రొడ్యూసర్ ఉషా ముల్పూరి,
