‘అరి’ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది – సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్

Published on Mar 14, 2023 2:30 pm IST

సంతోష్ శోభన్ హీరోగా 2018లో తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా అరి. ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మాతలుగా లింగారెడ్డి గునపనేని సహ నిర్మాతగా వ్యవహరిస్తూ నిర్మించిన ఈ సినిమాకి మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ఉపశీర్షిక. తాజాగా ప్యాన్ ఇండియన్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ ని సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ చూసి ఎంతో ఇంప్రెస్ అయి తన స్పందనని తెలియచేసారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ ఎమ్మెస్కే ప్రసాద్ గారి ద్వారా నిర్మాత శేషుగారు నిర్మించిన అరి సినిమా ట్రైలర్ చూడగానే నాకు ఎంతో పులకింత వచ్చేసింది. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ కృష్ణుడు ఎక్కడ కనిపించినా మా వైజయంతీ మూవీస్ లాగా అది ఎప్పుడూ శుభ సూచకం. ట్రైలర్ చూడగానే టెక్నీషియన్స్ అంతా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు అనిపిస్తోంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సమ్మర్ లో వస్తోన్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. గ్యారెంటీ హిట్ అవుతుందనే నమ్మకంతో టీమ్ అందరికీ అడ్వాన్స్ గా కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నాను అని అన్నారు.

అనంతరం దర్శక నిర్మాతలు అశ్వనీదత్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక విడుదలకు సిధ్దమవుతున్న అరి సినిమాలో అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, తమిళ బిగ్ బాస్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :