సీనియర్ హీరోతో ఆటకు సిద్దమైన యంగ్ హీరో !

యంగ్ హీరో నారా రోహిత్ సెట్స్ పై ఉన్న సినిమాలే కాకుండా మరొక కొత్త చిత్రానికి సిద్దమయ్యాడు. అదే ‘ఆటగాళ్లు’. ఈ చిత్రం ఈరోజే లాంచ్ అయింది. ‘ఆంధ్రుడు’ సినిమాతో మెప్పించిన దర్శకుడు పరుచూరి మురళి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాని చేస్తున్న సినిమా ఇది. రోహిత్ తో పాటు సీనియర్ హీరో కమ్ విలన్ జగపతిబాబు కూడా ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

తెలుగు పరిశ్రమలో మల్టీ స్టారర్ సినిమాలకు ఆదరణ పెరిగిన నైపథ్యంలో ఈచిత్రం వస్తుండటం అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. గేమ్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం సరికొత్త తరహా కాన్సెప్ట్ తో రూపొందనుందని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఫ్రెండ్స్ మూవీ కేలరీయేషన్స్ పతాకంపై వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర ఈ సినిమాని నిర్మిస్తుండగా సాయి కార్తీక్ సంగీతాన్ని అందించనున్నారు.