ఆకట్టుకుంటున్న ‘అతిథి దేవోభవ’ మెలోడీ..!

Published on Sep 27, 2021 11:15 pm IST

యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌గా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అతిధి దేవోభవ’. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన రాగా తాజాగా ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అనే పల్లవితో సాగే ఈ మెలోడీ యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది.

అయితే ఈ మెలోడీకి భాస్కరభట్ల లిరిక్స్ ఇవ్వగా, సిద్ శ్రీరామ్, నూతన మోహన్ ఆలపించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అవ్వగా, త్వరలోనే మేకర్స్ విడుదల తేదినీ ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :