“జవాన్ పార్ట్ 2” పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన అట్లీ.!

Published on Sep 17, 2023 12:00 pm IST

ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ సహా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా రికార్డు వసూళ్లు కొల్లగొటున్న చిత్రం “జవాన్”. బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార దీపికా పదుకోన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లో మరో పెద్ద హిట్ గా అయితే నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సెన్సేషనల్ సక్సెస్ అనంతరం చిత్ర యూనిట్ ఓ ప్రెస్ మీట్ ని పెట్టగా అందులో అయితే అట్లీ ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేసాడు.

ఇప్పటికే జవాన్ కి పార్ట్ 2 పై మంచి క్రేజ్ నెలకొనగా దానిపై మాట్లాడుతూ అందుకు అయితే పాజిబులిటీ ఉందని కన్ఫర్మ్ చేసాడు. అంతే కాకుండా ఈ చిత్రంలో విక్రమ్ రాథోర్ పాత్రపై ఎక్కువ ఫోకస్ ఉండేలా డిజైన్ చేస్తానని తెలిపాడు. జవాన్ సినిమా చూసాక అందరూ విక్రమ్ రాథోర్ రోల్ పైనే ఎక్కువగా మాట్లాడుకున్నారు. మరి దీనిపై సెపరేట్ సినిమా చేసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం :