తన సినిమాలపై ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేసిన అట్లీ.!

Published on Sep 21, 2023 10:23 am IST

కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుల్లో అట్లీ కూడా ఒకడు. మరి తన కెరీర్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో సినిమా కెరీర్ ని స్టార్ట్ చేసిన తాను నెక్స్ట్ దళపతి విజయ్ తో సినిమాలు చేసి భారీ హిట్ లు కొట్టాడు. అలా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ “జవాన్” అనే సినిమా చేసి కోలీవుడ్ లో ఏ దర్శకుడు కూడా అందుకొని రికార్డు మార్క్ వసూళ్ళని తాను అయితే అందుకున్నాడు. మరి తన ఫిల్మోగ్రఫీ పై తాను ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ని రివీల్ చేసాడు.

తాను చేసిన సినిమాలు అన్నీ చూస్తే అందులో డ్యూయల్ రోల్ లు లేదా ఒకే పాత్ర రెండు షేడ్స్ లో కనిపిస్తాయి. అయితే వాటిని తాను కావాలనే యాడ్ చేస్తానని తాను రివీల్ చేసాడు. మొదట సింగిల్ రోల్ కే కథ స్టార్ట్ చేస్తానని ఒకవేళ ఆ రైటింగ్ లో ఒక రోల్ తో తాను సాటిస్ఫై కాకుంటే అప్పుడు హై ఇచ్చేందుకు డ్యూయల్ ట్రిపుల్ రోల్స్ ని యాడ్ చేస్తానని అట్లీ తెలిపాడు. ఇలా తన సినిమాల్లో కొత్త పాత్రలు వస్తాయి. అయితే ఇంట్రెస్టింగ్ తాను సృష్టించిన రెండో పాత్రే సినిమాలో పెద్ద హైలైట్ అవుతుంది.

సంబంధిత సమాచారం :