తమిళ సినిమా దగ్గర ఉన్నటువంటి యంగ్ అండ్ స్టార్ దర్శకుల్లో వరుస హిట్స్ దర్శకుడు అట్లీ ఒకరు. మరి అట్లీ తెరకెక్కించిన “జవాన్” సినిమా హిట్ తర్వాత మరో సినిమా ఇంకా చేయలేదు. దీనితో తన నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది ఎవరితో ఉంటుంది అనేది మంచి ఆసక్తిగా మారింది. అయితే షారుఖ్ ఖాన్ తోనే జవాన్ 2 కానీ లేదా మరో సినిమా ఉంటుంది అని కానీ పలు రూమర్స్ వచ్చాయి కానీ ఏదీ ముందుకు కదల్లేదు. అయితే ఓ క్రేజీ బజ్ ఇపుడు వైరల్ గా మారింది.
అట్లీ ఒక భారీ మల్టీస్టారర్ సెట్ చేసినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే బాలీవుడ్ నుంచి కండల వీరుడు సల్మాన్ ఖాన్ లతో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఆల్రెడీ సల్మాన్ ఖాన్ మరో తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో “సికందర్” అనే భారీ సినిమా ప్రస్తుతం చేస్తున్న సంగతి తెలిసిందే.