అట్లీ కోసం ‘షారుఖ్’ ద్విపాత్రాభినయం !

Published on Sep 6, 2021 7:01 am IST


తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీకి నేషనల్ వైడ్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా సెప్టెంబర్‌ 13న నుండి 10 రోజుల పాటు పుణెలో ఈ చిత్రం చిత్రీకరణ జరగనుంది. ఇక ‘లేడీ సూపర్ స్టార్ నయనతార’ ఈ సినిమాతో మొదటిసారి బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో షారుఖ్‌ పాత్ర ద్విపాత్రాభినయం.

అంటే సీనియర్ షారుఖ్‌ సరసన ఈ సౌత్‌ లేడీ సూపర్‌స్టార్‌ నటిస్తోంది. నయనతార గతంలో అట్లీతో ‘రాజారాణి’ సినిమా చేసింది, అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అందుకే అట్లీ, నయనతారను హీరోయిన్ గా పెట్టుకుంటున్నారు. ఇక ‘రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్’ ఇలా అట్లీ తీసిన ప్రతి సినిమా సూపర్ హిటే. అందుకే అట్లీకి ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది.

సంబంధిత సమాచారం :