త్వరలో ప్రారంభం కానున్న ATM వెబ్ సిరీస్ షూటింగ్

త్వరలో ప్రారంభం కానున్న ATM వెబ్ సిరీస్ షూటింగ్

Published on Jan 28, 2022 11:45 AM IST


గత కొద్ది రోజుల నుండి హరీష్ శంకర్ మరియు దిల్ రాజు లు మరొకసారి కలిసి పని చేస్తున్నారు అనే వార్త పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హరీష్ శంకర్ వెబ్ సిరీస్ కోసం కథ ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు దీనిని నిర్మించనున్నారు. ఈ సీరీస్ కు ATM అనే టైటిల్ ను ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ZEE 5 లో ఈ వెబ్ సిరీస్ రానున్నట్లు తెలుస్తోంది. రాబరీ ఆధారిత వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వెబ్ సిరీస్ కు చంద్ర మోహన్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ సిరీస్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సీరీస్ కు సంబంధించిన పలు విషయాలను త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. దీనికి సంబందించిన ఒక ఫోటో ను సోషల్ మీడియాలో లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ సీరీస్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు