రవితేజ “ఖిలాడి” నుండి అట్టా సూడకే లిరికల్ వీడియో విడుదల!

Published on Dec 31, 2021 11:00 am IST

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం లో మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయతీ లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్ పతాకంపై సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం నుండి అట్టా సూడకే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. మీనాక్షి చౌదరీ మరియు రవితేజ లు ఈ పాటలో ఆడి పాడినట్లు తెలుస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :