తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై దాడి..!

Published on Nov 4, 2021 1:38 am IST


తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతికి ఊహించని ఘటన ఎదురయ్యింది. బెంగుళూరు విమానాశ్రయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి విజయ్ సేతుపతిపై దాడి చేశాడు. విమానం దిగి బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా పరుగెత్తుకొచ్చి వెనకనుంచి సేతుపతిను ఎగిరి మరీ తన్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఆగంతకుడిని పట్టుకున్నారు.

అసలు తనపై ఆగంతకుడు ఎందుకు దాడి చేశాడో తెలియక విజయ్ సేతుపతి ఒకింత దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీనిపై ఏమీ స్పందించకూడా అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ దాడికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :