సమంత “శాకుంతలం” పై సర్వత్రా ఆసక్తి!

Published on Feb 17, 2023 7:36 pm IST

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. గుణ టీమ్ వర్క్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లపై నీలిమ గుణ, దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యశోద లాంటి సూపర్ హిట్ తర్వాత సమంత చేస్తున్న చిత్రం కావడం, డైరెక్టర్ గుణశేఖర్ కూడా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకం గా తెరకెక్కించడం తో సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం లో దేవ్ మోహన్, మోహన్ బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :