అవతార్ 2 : ఈ వెర్షన్ ని వదిలేస్తున్న ఆడియెన్స్.?

అవతార్ 2 : ఈ వెర్షన్ ని వదిలేస్తున్న ఆడియెన్స్.?

Published on Dec 18, 2022 9:00 AM IST

హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ నుంచి ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన మరో భారీ విజువల్ ట్రీట్ “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా సెన్సేషన్ ని రేపుతూ ఉండగా ఈ రెండు రోజుల్లో రికార్డు మార్క్ వసూళ్లు అయితే నమోదు అవుతున్నాయి. అయితే ఈ లార్జర్ దన్ లైఫ్ చిత్రాన్ని వీక్షకులు థియేటర్స్ లో మళ్ళీ చూసి మైమరచిపోడానికి మాత్రం బెస్ట్ వెర్షన్ ని మాత్రమే ఆడియెన్స్ ఆసక్తికరంగా ఎంచుకుంటున్నారట.

ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2D అలాగే 3D వెర్షన్ లలో రిలీజ్ చేయగా వీటిలో దాదాపు ఆడియెన్స్ అంతా కూడా కేవలం 3D వెర్షన్ లో మాత్రమే చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. దీనితో 2D వెర్షన్ థియేటర్స్ లో జనం కరువవుతున్నారని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ క్రేజీ ట్రీట్ ని మాత్రం ఆడియెన్స్ మరింత రియలిస్టిక్ ట్రీట్ లోనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు