విరాట పర్వం: సాయి పల్లవిపై నెటిజన్లు ప్రశంసల వర్షం!

Published on Jun 17, 2022 11:00 am IST


రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఫస్ట్ షోల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రీమియర్ షోలను చూసిన చాలా మంది నెటిజన్లు ఈ సినిమాలో సాయి పల్లవి అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేసిందని కొందరు ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు.

SLV సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :