ఇంటర్వ్యూ : మారుతి దాసరి – సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఓసీడీ ఫీలవుతారు !

ఇంటర్వ్యూ : మారుతి దాసరి – సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఓసీడీ ఫీలవుతారు !

Published on Sep 28, 2017 5:07 PM IST

యూత్ పల్స్ తెలిసిన దర్శకుడు మారుతి దాసరి చేసిన తాజా చిత్రం ‘మహానుభావుడు’. శర్వానంద్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ చిత్రం రేపే విడుదలకానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సంగతులు మీకోసం…

ప్ర) మీ హీరోకి అతి శుభ్రత అనే లక్షణాన్ని ఎందుకు పెట్టారు ?

జ) సాధారణంగా నా సినిమాల్లో హీరోకి ప్రత్యేకమైన క్యారేజిటరైజేషన్ ఉంటుంది. ‘భలే భలే మగాడివోయ్’ లో చూస్తే హీరోకి లోపం ఉన్నట్టు ‘మహానుభావుడు’ లో హీరోకి అతి శుభ్రత అనే అలవాటు ఉంటుంది. కథకి తోడు హీరో పాత్రకి కూడా ప్రత్యేకత ఉంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశ్యంతో ఇలా డిజైన్ చేయడం జరిగింది.

ప్ర) ఎక్కువగా యంగ్ హీరోలతోనే ఎందుకు సినిమాలు చేస్తున్నారు ?

జ) అలా ఏం లేదు. కథకి, పాత్రలకి తగ్గట్టే హీరోలను ఎంచుకుంటూ ఉంటాను. నా దగ్గర పెద్ద హీరోలకు సరిపోయే కథలు కూడా ఉన్నాయి.

ప్ర) ఈ కథకి శర్వానంద్ నే ఎంచుకోవడానికి కారణం ?

జ) శర్వానంద్ సినిమాల్ని చూస్తే అన్నీ నటనతో కూడుకున్నవే అయ్యుంటాయి. ఏదైనా పాత్రని ఇస్తే మిగతా స్టార్ హీరోలు ఆ పాత్రని తమలోకి తెచ్చుకుని నటించి తర్వాత బయటకు పంపిస్తారు. కానీ శర్వానంద్ మాత్రం తానే ఆ పాత్రలోకి వెళ్లి నటించి బయటకు వస్తాడు. అందుకే అతన్ని ఎంచుకున్నాను.

ప్ర) ఈ కథతో ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా ?

జ) స్వచ్ఛ భారత్ అని అందరూ బయటికొచ్చి పనిచేస్తుంటే కొందరు మాత్రం మనకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళు శుభ్రం చేయకపోయినా పర్వాలేదు కనీసం చేసేవాడికైనా సహకారం అందిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశ్యం. ఆ పాయింట్ నే ఈ సినిమాతో చెప్పాను.

ప్ర) ఈ కథకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ?

జ) ఇన్స్పిరేషన్ కోసం ప్రత్యేకంగా ఎక్కడా వెతకలేదు. మన చుట్టూ ఉండేవారిలోనే ఇలాంటివి ఉంటాయి. కొంతమంది కింద నీళ్లు పడ్డా వాటిని తుడిచి అవి ఆరిపోయేదాకా ప్రశాంతంగా ఉండలేరు. ఆ లక్షణం సంవత్సరాలు గడిచే కొద్దీ పెరిగిపోయి ఒక డిసార్డర్ గా మారిపోతుంది.

ప్ర) ట్రైలర్ బయటికొచ్చాక ఓసీడీని తక్కువగా చూపించారని కామెంట్స్ వచ్చాయి ?

జ) అవును వచ్చాయి. ఓసీడీలో చాలా రకాలుంటాయి. సినిమాలో కూడా చాలానే చూపించాను. ట్రైలర్లో ఎక్కువగా చూపిస్తే ఏదో డాక్టర్ స్టోరీ చెప్పినట్టు ఉంటుందని చెప్పలేదు.

ప్ర) సినిమా చూశాక ప్రేక్షకులు ఎలాంటి అనుభూతికి గురవుతారు ?

జ) ఎవరైనా సినిమా చూస్తే అది వాళ్ళ మీద ప్రభావం చూపాలి. నా సినిమాలోని హీరో పాత్ర అలాంటి ప్రభావం చూపుతుంది. సినిమా చూశాక ఆడియన్స్ హీరోకి ఉన్నట్టే మన చుట్టూ కూడా చాలా అశుభ్రత ఉంది కదా అని ఫీలవ్వాలి.

ప్ర) ‘బాబు బంగారం’ తర్వాత ఎలా రీఫ్రెష్ అయ్యారు ?

జ) రీ ఫ్రెష్ ఏం లేదు. ఓక్ పెద్ద హీరోతో అలాంటి కత చేయాలని అనుకున్నాను. అలాగే చేశాను. నేను ఎంత సక్సెస్ అయితే అనుకున్నానో అంతే వచ్చింది. ఎందరో హ్యాపీ. కానీ ఆ కథను ఇంకా బాగా చేసుండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాలో ఇప్పటికీ ఉంది.

ప్ర) పెద్ద హీరోలకి, చిన్న హీరోలకి తేడా ఏంటి ?

జ) తేడా ఎక్కువ ఉండదు. కానీ వాళ్ళ నుండి హీరోయిజం కోరుకుంటారు ఆడియన్స్. దర్శకుడిలో దమ్ముండి, అతను చేయగలను, ఎలాంటి సమస్యైనా పెట్టి ప్రేక్షకుల్ని మెప్పించగలను అనుకుంటే చేయగలడు. హీరోలు కూడా అలాంటి వలలతో వర్క్ చేయడానికి ముందుకొస్తారు. ఉదాహరణకి గజినీ సినిమాలో స్టార్ హీరో సూర్యకి ప్రాబ్లమ్ ఉంటుంది కానీ హీరోయిజం ఎక్కడా తగ్గదు. ఇప్పుడు రవితేజ చేసే ‘రాజా ది గ్రేట్’ కూడా ఒకటి.

ప్ర) ‘భలే భలే మగాడివోయ్, మహానుభావుడు’ ని పోల్చుకుంటున్నారు మీ ఫీలింగ్ ?

జ) మంచిదే కదా. దాన్ని కూడా నేనే డైరెక్ట్ చేశాను. నా సినిమాని వేరే చెత్త సినిమాతో కాకుండా మంచి హిట్ సినిమాతోనే పోలుస్తున్నారు. ఇక సినిమా దానిలానే ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా అనేది సినిమా చూశాక తెలుస్తుంది.

ప్ర) ‘బాబు బంగారం’ తర్వాత ఎలా రీఫ్రెష్ అయ్యారు ?

జ) రీఫ్రెష్ ఏం లేదు. ఓక్ పెద్ద హీరోతో అలాంటి కత చేయాలని అనుకున్నాను. అలాగే చేశాను. నేను ఎంత సక్సెస్ అయితే అనుకున్నానో అంతే వచ్చింది. అందరూ హ్యాపీ. కానీ ఆ కథను ఇంకా బాగా చేసుండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాలో ఇప్పటికీ ఉంది.

ప్ర) పెద్ద హీరోలకి, చిన్న హీరోలకి తేడా ఏంటి ?

జ) తేడా ఎక్కువ ఉండదు. కానీ స్టార్ హీరోల నుండి నుండి హీరోయిజం కోరుకుంటారు ఆడియన్స్. దర్శకుడిలో దమ్ముండి, అతను చేయగలను, ఎలాంటి సమస్యైనా పెట్టి ప్రేక్షకుల్ని మెప్పించగలను అనుకుంటే చేయగలడు. హీరోలు కూడా అలాంటి వాళ్ళతో వర్క్ చేయడానికి ముందుకొస్తారు. ఉదాహరణకి గజినీ సినిమాలో స్టార్ హీరో సూర్యకి ప్రాబ్లమ్ ఉంటుంది కానీ హీరోయిజం ఎక్కడా తగ్గదు. ఇప్పుడు రవితేజ చేసే ‘రాజా ది గ్రేట్’ కూడా అలాంటిదే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు