బిగ్ బాస్ 5: ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు!

Published on Sep 29, 2021 4:40 pm IST


బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి ఏడాది ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి ఐదవ సీజన్ వచ్చేసింది. అయితే ఈ ఏడాది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదని ముందుగానే తెలపడం జరిగింది. కానీ ఇంకా కొంతమంది ఒక వ్యక్తి గురించి చర్చించడం మనం చూస్తూనే ఉన్నాం. యాంకర్ విష్ణు ప్రియ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి ప్రవేశించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం ఈ రియాలిటీ షో నాల్గవ వారంలో కి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధ్యపడదు. ప్రస్తుతం వీక్ డేస్ లో బిగ్ బాస్ రియాలిటీ షో రేటింగ్ పడిపోతూ ఉండటం తో మేకర్స్ ఇందుకోసం ఏదైనా ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత సమాచారం :