మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్న రామ్ చరణ్ !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రం ఆఖరి దశ షూటింగ్ ను రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇంకొద్దిరోజుల్లో చిత్రీకరణ మొత్తం పూర్తికానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 24న టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. కేవలం సినిమా పరంగానే కాకుండా హీరో చరణ్ పరంగా కూడా ఈ టీజర్ కు కొంత ప్రత్యేక ఉంది.

అదేమిటంటే ఇన్నాళ్లు రెగ్యులర్ కమర్షియల్ లుక్స్ లో మాత్రమే సినిమాలు చేసిన మిస్టర్ సి ఈ సినిమాలో ప్రయోగాత్మకంగా పల్లెటూరి యువకుడిలా కనిపించనున్నాడు. ఆయన వేషం దగ్గర్నుండి ఫిజిక్, బాడీ లాంగ్వేజ్, మాట్లాడే భాష, నటన అన్నింటిలోనూ కొత్తదనం కనిపిస్తుందని, అభిమానులు, ప్రేక్షకులు మెస్మరైజ్ అవ్వడం ఖాయమని సినీ సన్నిహిత చెబుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ కు జోడీగా సమంత నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.