బాలయ్య ‘శాతకర్ణి’ ఆడియో డేట్ ఫిక్సైంది !

gpsk
నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. సినిమా సంక్రాంతికి విడుదలవుతుండటం వలన చిత్ర టీమ్ ప్రోమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగానే టీజర్, ట్రైలర్ ను ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. మొన్నీ మధ్య విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉండి బ్రహ్మాండమైన స్పందన దక్కించుకుని యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటోంది.

ఈ ఊపులోనే ఆడియో కార్యక్రమం కూడా నిర్వహించి సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు టీమ్ ఆడియో కార్యక్రమాన్ని ఈ నెల 26న తిరుపతిలోని పండిట్ జవహర్ లాల్ నెహ్రు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి, బాలకృష్ణ వియ్యంకుడు నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు.