అభిమానుల సమక్షంలో ‘జై సింహ’ ఆడియో !

బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘జై సింహ’. కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 24 న ఈ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో ఘనంగా అభిమానుల సమక్షంలో జరపబోతున్నారు.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ నయనతార , నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు. చిరంతన్‌ భట్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంభందించి డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరుకు బాలయ్య కెరీర్లో సింహా అనే టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించినట్లు ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.