త్వరలో విక్రమ్ స్కెచ్ మూవీ ఆడియో!


చియాన్ విక్రమ్ కి తమిళ నాట ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. ఇప్పుడు విక్రమ్ చేతిలో స్కెచ్ అనే సినిమా ఒకటి హరి దర్శకత్వంలో సామి స్క్వేర్ ఒకటి ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్ జరుపుకుంటున్నాయి. స్కెచ్ సినిమాలో విక్రమ్ కి జోడీగా తమన్నా నటిస్తుంటే, సామి స్క్వేర్ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తుంది.

విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలోని పాటలని త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో ఉంటుందని తెలుస్తుంది.