ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “ఆగస్ట్ 16, 1947”

Published on May 5, 2023 9:03 pm IST

ఆగస్ట్ 16, 1947 అనే పిరియాడికల్ ఫిల్మ్ ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్మించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా నటించారు. ఎన్ ఎస్ పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం విడుదలైన ఒక నెల తర్వాత డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రస్తుతం, తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఆగస్ట్ 16, 1947 తమిళనాడులోని సెంగడు అనే మారుమూల గ్రామంలో జరిగే పీరియాడికల్ ఫిల్మ్. ఒక బ్రిటిష్ అధికారి భారతదేశ స్వాతంత్ర్యానికి సంబంధించిన సమాచారాన్ని గ్రామస్తులకు వెల్లడించడు, తర్వాత ఏం జరుగుతుందనేది సినిమా కథలో కీలకాంశం. ఈ పీరియాడికల్ డ్రామాలో రేవతి, రిచర్డ్ ఆష్టన్, రాబర్ట్, పుగజ్ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :