
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ఈ ఏడాది వచ్చిన ‘పటాస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆయన అప్పుడే తన తదుపరి సినిమా ‘షేర్’ సినిమా శోటింగ్ ని ఫినిష్ చేసాడు. ఈ సినిమాలో మిగిలి ఉన్న ఒకే ఒక్క సాంగ్ సూహ్టింగ్ ని జూలై 11 నుంచి మలేషియాలో షూట్ చేయనున్నారు. అలాగే షేర్ టీం మరియు కళ్యాణ్ రామ్ ఈ సినిమాని ఆగష్టు లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మల్లికార్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది.
ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘కిక్ 2’ సినిమా షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. క్రేజీ మూవీ కిక్ కి సీక్వెల్ గా వస్తున్న కిక్ 2 సినిమాని కూడా ఆగష్టులోనే రిలీజ్
చెయ్యాలనుకుంటున్నారు. అందుకే ఆగష్టు నెల కళ్యాణ్ రామ్ కి అటు హీరోగా, ఇటు నిర్మాతగా చాలా కీలకమైందని చెప్పాలి. వేటికవే ప్రత్యేకంగా డిఫరెంట్ కథలతో వస్తున్న ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకొని కళ్యాణ్ రామ్ కి ఫుల్ ఎనర్జీని ఇస్తాయని ఆశిద్దాం.
రవితేజ హీరోగా నటించిన కిక్ 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపిచనుంది. సురేందర్ రెడ్డి డైరెక్టర్.