గెట్ రెడీ.. ఆరా ఆఫ్ ‘ఉస్తాద్’ నుంచి ప్రోమో ఎప్పుడంటే!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నా కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Singh). మాస్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రం నుంచి రెండో సాంగ్ గా ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ ఇప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఈ ఫిబ్రవరి 22న సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఓ మాస్ ప్రోమోను సిద్ధం చేస్తున్నారట. ఇక ఈ ప్రోమో రేపే ఫిబ్రవరి 19న వస్తున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది. మరి దీనిని దేవిశ్రీ ప్రసాద్ ఎలా ప్లాన్ చేసారో వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు పార్తిబన్ విలన్ పాత్రలో నటించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మార్చ్ 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version