వైరల్ : బాలయ్య డైలాగ్స్ తో అదరగొట్టిన స్టీవ్ స్మిత్.!

Published on Jun 10, 2023 9:02 am IST


ప్రస్తుతం నందమూరి నరసింహాం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న యాక్షన్ చిత్రం “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే. మరి నేడు బాలయ్య బర్త్ డే కానుకగా అయితే ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ రాబోతుండగా ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఇక బాలయ్య అంటేనే మొదటగా మనకి గుర్తొచ్చేది తన పవర్ ఫుల్ వాయిస్ లో మాస్ డైలాగ్స్ మరి ఈ డైలాగ్స్ ని అస్సలు తెలుగు రాని ఇంగ్లీష్ వ్యక్తులు మాట్లాడితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

మరి అలాంటిది ఆస్ట్రేలియన్ ప్రముఖ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తో మన వాళ్ళు బాలయ్య డైలాగ్స్ సహా పలు టాలీవుడ్ సినిమా డైలాగ్స్ ని చెప్పించారు. దీనితో ఈ వీడియో క్లిప్ ఇపుడు వైరల్ గా మారింది. మరి ప్రస్తుతం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఈ మ్యాచ్ బ్రాడ్ కాస్ట్ సంస్థ స్టార్ వారు అయితే తెలుగు నుంచి స్టీవ్ స్మిత్ తో ఈ బైట్స్ తీసుకోవడం జరిగింది. దీనితో స్టీవ్ చెప్పిన ఈ డైలాగ్స్ ఇపుడు వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :